కమ్యూనిస్టులపై విమర్శలు ఎవరి ప్రయోజనం కోసం?
Posted On: Thursday,May 16,2019
ఎవరు ఏ కులంలో పుట్టారు? ఏ వర్గంలో పుట్టారు అని కాదు మనం చూడాల్సింది. ఎక్కడ పుట్టినా ఏ తరగతుల ప్రజల కోసం పాటుపడుతున్నారనేది మనం చూడాలి. మన దేశంలో కులతత్వం, అంటరానితనం పోవాలన్నా, కుల నిర్మూలన జరగాలన్నా మనుధర్మ శాస్త్రాన్ని, అగ్రకుల ఛాందసత్వాన్ని తునాతునకలుగా పేల్చివేయమని చెప్పాడు అంబేద్కర్. చెప్పిన దానిని ఎంతమంది పాటిస్తున్నారు? హిందూ మత, కుల దురహంకారానికి వ్యతిరేకంగా ఎందరు పోరాడుతున్నారో చెప్పగలరా?
అంబేద్కర్‌వాదులమని, దళిత నాయకులమని చలామణి అవుతూ అంబేద్కర్‌ను కీర్తిస్తూ సందర్భం లేకపోయినా కమ్యూనిస్టులనూ, ప్రజాసంఘాలనూ నిందిస్తున్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని కీర్తించడంలో తప్పులేదు. కానీ అంబేద్కర్‌ని దళితులు తప్ప ఇతరులు మరెవ్వరూ గుర్తించలేదని, అగ్రకులతత్వంతో కమ్యూనిస్టులు అంబేద్కర్‌ని గుర్తించ నిరాకరిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఏం చేశారనేది తెలుసుకోకుండా, విషయాన్ని పరిశీలించకుండా సంకుచిత దృక్పథంతో దాడి చేస్తున్నారు.
సోషల్ మీడియా రోజురోజుకూ పెద్దఎత్తున ఆదరణ పొందుతోంది. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలగు పలు వేదికల ద్వారా విస్తృతంగా భావాలు ప్రచారం చేస్తున్నారు. వారికి నచ్చిన ఇతరుల భావాలను లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్స్ పెట్టడం లాంటివీ చేస్తున్నారు. రోజువారీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పోటీపడి క్షణాల్లో వారికి నచ్చిన, ఇష్టమైన సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. దీనివల్ల సానుకూలంగానో, వ్యతిరేకంగానో భావాలపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిని ఆహ్వానించాలి. కానీ అదే సమయంలో కొంతమంది మతతత్వాన్ని సమర్ధిస్తూ లౌకికవాదులపై, అభ్యుదయవాదులపై, కార్టూనిస్టులపై విమర్శల దాడులు చేస్తున్నారు. కొంతమంది దళిత నాయకులు, దళితవాదం పేరుతో కమ్యూనిస్టులపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. అంబేద్కర్‌వాదులమని, దళిత నాయకులమని చలామణి అవుతూ అంబేద్కర్‌ను కీర్తిస్తూ సందర్భం లేకపోయినా కమ్యూనిస్టులనూ, ప్రజాసంఘాలనూ నిందిస్తున్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని కీర్తించడంలో తప్పులేదు. కానీ అంబేద్కర్‌ని దళితులు తప్ప ఇతరులు మరెవ్వరూ గుర్తించలేదని, అగ్రకులతత్వంతో కమ్యూనిస్టులు అంబేద్కర్‌ని గుర్తించ నిరాకరిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఏం చేశారనేది తెలుసుకోకుండా, విషయాన్ని పరిశీలించకుండా సంకుచిత దృక్పథంతో దాడి చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరైంది కాదు.
కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో ఏర్పడిన మొదలు కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు సమస్యల పైన దళితులు, కార్మికులు, శ్రమజీవుల కోసం విరామమెరుగని పోరాటం చేసింది. ఈ పోరాటంలో దేశంలో అనేకమంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ప్రాణాలర్పించారు. ఇది దాచేస్తే దాగని సత్యం. చెరిపేస్తే చెరగని వాస్తవం.
అంటరాని కులంలో పుట్టి పెరిగిన అంబేద్కర్ తుది శ్వాస విడిచే వరకూ కుల వివక్షతకూ, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళితులు, కార్మికులు, స్త్రీల హక్కుల కోసం పోరాడుతూ రాజ్యాంగ నిర్మాతగా నిలిచాడు. దీనికి యావత్తు భారతదేశం గర్వించింది. మన దేశమే కాదు ఒక విధంగా ప్రపంచమే ఆయనను కొనియాడుతున్న పరిస్థితి నేడు ఉంది. దీనిని అంబేద్కర్‌వాదులే కాదు. ప్రజాతంత్రవాదులు, కమ్యూనిస్టులు కూడా హర్షిస్తున్నారు.
మధ్యయుగంలో కులతత్వానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం పేరుతో అనేకమంది ప్రచారం చేశారు. ఆధునిక కాలంలో జ్యోతిబాపూలే, డాక్టర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, నారాయణగురు లాంటి యోధులు అనేక పోరాటాలు చేయడం ద్వారా సమాజంలో కొంతవరకు మార్పు తీసుకొచ్చారు.
అదే విధంగా కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏర్పడిన తరువాత కులతత్వానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపింది. ఈ పోరాటాల్లో అగ్రభాగాన ఉండి దళితుల పక్షాన నిలబడి, అగ్రకుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన వారు, కమ్యూనిస్టు పార్టీలో చేరిన అగ్రకులాలకు చెందిన ఆనాటి యువకులే. మన రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్రకులంలో పుట్టి, అగ్రకుల దురహంకారానికి వ్యతిరేకంగా దళితుల పక్షాన పోరాడిన యోధుడు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాడు. 'దున్నే వాడికే భూమి' నినాదంతో పోరాటాలు నడిపి లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన మహత్తర పోరాటం వీర తెలంగాణ విప్లవ పోరాటం. కూలీ రేట్ల పెంపు, భూ పంపిణీ కోసం పోరాడిన ధీరుడు పుచ్చలపల్లి సుందరయ్య. తన యావదాస్తి ప్రజల కోసం ధారపోసి ప్రజల కోసం, శ్రమ జీవుల రాజ్యం రావాలని పోరాడిన ధీశాలి. దీనిని ఎవరైనా కాదనగలరా? ఆయన ఒక్కరే కాదు. మన రాష్ట్రంలో అగ్రకులాల నుంచి వచ్చిన మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు లాంటివారు కమ్యూనిస్టు పార్టీలో చేరి దళితుల కోసం పోరాడుతుంటే కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కాల్చేయమని ఆర్డరు వేస్తే వారిని కంటికి రెప్పలా, కడుపులో బిడ్డలా దాచుకున్నది దళిత పేటలే కదా. అదే విధంగా కేరళలో బ్రాహ్మణ కులంలో పుట్టిన నంబూద్రి పాద్, ఎకె గోపాలన్, తమిళనాడులో పి రామ్మూర్తి లాంటి వారెందరో ఉన్నారు. ఇది యధార్థం కాదా? భూస్వాములు కుల దురహంకారంతో కమ్యూనిస్టు పార్టీని మాల, మాదిగల పార్టీగా ప్రచారం చేశారనే సంగతి మనకు తెలియదా?
ఎవరు ఏ కులంలో పుట్టారు? ఏ వర్గంలో పుట్టారు అని కాదు మనం చూడాల్సింది. ఎక్కడ పుట్టినా ఏ తరగతుల ప్రజల కోసం పాటుపడుతున్నారనేది మనం చూడాలి. అంబేద్కర్ గొప్ప ప్రజాస్వామ్య వాది. కమ్యూనిస్టులు కూడా ప్రజాస్వామ్య వాదులే. హక్కుల కోసం ఎంతకైనా తెగించి పోరాడుతారు. అంబేద్కర్ చేసిన పోరాటాలను, ఆయన చేసిన త్యాగాన్ని కమ్యూనిస్టులు విస్మరించడం లేదు. వ్యక్తి పూజ తప్పని, వ్యక్తి పూజ బానిస మనస్తత్వానికి నిదర్శనమని అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. కాని అంబేద్కర్ వారసులమని చెప్పుకునే కొందరు అంబేద్కర్‌ని కీర్తిస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారా? మన దేశంలో కులతత్వం, అంటరానితనం పోవాలన్నా, కుల నిర్మూలన జరగాలన్నా మనుధర్మ శాస్త్రాన్ని, అగ్రకుల ఛాందసత్వాన్ని తునాతునకలుగా పేల్చివేయమని చెప్పాడు అంబేద్కర్. చెప్పిన దానిని ఎంతమంది పాటిస్తున్నారు? హిందూ మత, కుల దురహంకారానికి వ్యతిరేకంగా ఎందరు పోరాడుతున్నారో చెప్పగలరా? ఈరోజు బిజెపి నాయకులు అగ్రకులాధిపత్యాన్ని, మనువాదాన్ని ప్రచారం చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. దళితులపై దాడులు చేస్తూ, దళిత స్త్రీలను మానభంగాలకు గురిచేసి హత్యలు చేస్తున్నారు. గోవధ నిషేధం పేరుతో దళితులపైనా, మైనార్టీలపైనా దాడులు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే కదా! అందుకే బిజెపి మతోన్మాదులు, కమ్యూనిస్టులపై విషం చిమ్ముతున్నారు. కొంతమంది దళిత నాయకులు కూడా దానికి వంతపాడటం సరైనదేనా? కులతత్వానికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు లపై ఎందుకు నిందలు వేస్తున్నారు? దీని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతున్నదో ఆలోచించాలి.
అంబేద్కర్ ఈ దేశంలో భూమిని జాతీయం చేసి, భూమి లేని పేదలకు ఇవ్వాలన్నారు. పేదల చేతిలో పెట్టుబడికి డబ్బు ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలన్నారు. భారీ పరిశ్రమలను, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాలను జాతీయం చేయాలన్నారు. అంబేద్కర్ ఏం చెప్పాడో, కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కూడా అదే కదా! ఆయన ఆశయ సాధనకై నేడు పోరాడుతున్నది కమ్యూనిస్టులేగా. అలాం టప్పుడు కమ్యూనిస్టులపై బురద జల్లడం ఏవిధంగా సరైంది? దళిత నాయకులు, అంబేద్కర్‌వాదులు కమ్యూనిస్టులను మిత్రులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడడం సరికాదు.
ఇటీవల మన రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, బిఎస్‌పి పార్టీలు కలిసి పని చేశాయి. సిపిఎం, సిపిఐ పార్టీల ఫ్లెక్సీల మీద కమ్యూనిస్టు పార్టీలు, జనసేన నాయకుల ఫొటోలతోపాటు బహుజన నేత మాయావతి ఫొటో వేసి ప్రచారం చేశాయి. జాతీయ స్థాయిలోని నేతలు, ఇలా కలిసి పని చేయడానికి సిద్ధ పడుతూంటే, ఆ ఐక్యతను బలపర్చాల్సింది పోయి చీలికలను సృష్టించాలని ప్రయత్నించడం సమంజసమేనా?
కమ్యూనిస్టులు బిఎస్‌పితో కలిసి సామాజిక వివక్షత పైన, ప్రజా సమస్యల పైన పని చేయడానికి, సుముఖంగా ఉన్నారన్న విషయం తెలియని వారు మాత్రమే కమ్యూనిస్టులపై నిందలు వేస్తున్నారు. ఇటువంటి వారే పెట్టుబడిదారుల, భూస్వాముల పార్టీలైన కాంగ్రెస్, వైసిపి, తెలుగుదేశం, బిజెపిల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ, వారి జెండాలను మోస్తున్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే ఈ బూర్జువా పార్టీల నాయకులు నోళ్లు విప్పుతు న్నారా? కమ్యూనిస్టులే కదా గొంతెత్తి నినదించేది. అలాంటి కమ్యూనిస్టులతో చెలిమి చేయకుండా దళితులపై దాడులు చేస్తున్న వారి జెండాలను మోయటంలో అర్థమేంటి?
అంబేద్కర్ దోపిడీ పాలన పోవాలనీ, స్టేట్ సోషలిజం రావాలని కోరాడు. అంతేకాదు ఈ దేశంలో సోషలిజం తీసుకొచ్చేది నా ప్రజలే అని కరాఖండిగా చెప్పాడు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కమ్యూనిస్టులు, అంబేద్కర్‌వాదులు ఇంకా అనేక సామ్యవాద శక్తులను కలుపుకొని పెద్ద ఉద్యమం నడపాలి.
కాని అంబేద్కర్‌వాదులమని చెప్పుకుంటున్న కొందరు 'మేడే' పైన, దానితోబాటు కమ్యూనిస్టుల పైన అకారణంగా దాడి చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద కష్టజీవులు జరిపే పండుగ ఇది. విముక్తి కోసం సమైక్యంగా పోరాడమని ఉత్తేజపరిచే దీక్షాదినం. దేశాల ఎల్లలు, మత విద్వేషాలు, కులాల అడ్డుగోడలు అన్నింటినీ అధిగమించి ప్రపంచ మంతటా జరిపే పండుగ ఇది. పెట్టుబడిదారుల పల్లకీ మోసే వారు మాత్రమే దీనిని సహించలేరు. అణచివేత, దోపిడీ, వివక్షత ఏ రూపంలో ఉన్నా దానిని ఎదిరించి పోరాడాలను కునేవారు మేడేను విమర్శించరు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున జరుగుతున్న కార్పొరేటీకరణ, ప్రపంచీకరణ, దళితుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అభివృద్ధి పేర దళితుల భూములను లాక్కుంటున్నారు. ప్రభుత్వ నియామకాలు జరపడం లేదు. ఈ ప్రపంచీకరణ వల్ల అందరికన్నా ఎక్కువ నష్టపోతున్నది దళితులు. దీనిపై అందరికన్నా గట్టిగా పోరాడుతున్నది కమ్యూనిస్టులు. దళిత ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం సమన్వయంతో ముందుకు సాగాల్సిన తరుణం ఇది.
- దడాల సుబ్బారావు ( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,
సెల్ : 9490098833 )

No comments:
Post a Comment