Thursday, July 25, 2019

నవయుగ ప్రవక్త పెరియార్‌


నవయుగ ప్రవక్త పెరియార్‌
Posted On: Sunday,September 17,2017

             పెరియార్‌ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి  ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి  మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా  చేశాయి.

                                 ప్రముఖ హేతువాది పెరియార్‌ జయంతిని సెప్టెంబర్‌ 17న దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. ఆయన ప్రచారం చేసిన 

హేతువాద-నాస్తిక భావాలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. 
'మన జీవితాన్ని నడిపించే భౌతిక శక్తులేవో, వాటిని అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన విజ్ఞాన మేమిటో అందరూ గ్రహించాలి. 

అర్థంలేని మత విశ్వాసాలు, కాల దోషం పట్టిన ఆచారాలు, వాటిని వ్యాప్తిలో వుంచే సినిమాలు, సాహిత్యాలు, ఇతర క్షుద్రకళలు, దేవుళ్ళు, బాబాలు, 

భక్తులు, ప్రచారాలు- లాంటి భూతాలు మన జీవితాలను పట్టి పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాగరిక ప్రపంచంలో వీటికి స్థానం లేదు. వీటి నుంచి జాతి 

విముక్తి పొందటమే గొప్ప అభ్యుదయం' అంటారు కొడవటిగంటి కుటుంబరావు. సరిగ్గా ఇలాంటి దృక్పథంతోనే సమాజం పట్ల గల మహత్తర బాధ్యతతో, 

మనుషుల మీద వల్లమాలిన ప్రేమతో -సమస్త మూఢ విశ్వాసాల మీద, అర్థం లేని మతాచారాల మీద బుద్ధుని దగ్గరి నుంచి (అంతకు మందు చార్వాకుల 

దగ్గరి నుంచి) నేటి రావిపూడి వెంకటాద్రి దాకా-పోరాడుతున్న వాళ్ళు అనేకులున్నారు. ఆధునిక యుగానికి సంబంధించినంతవరకు ఈ రంగంలో 

ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన నిండు జీవితాన్ని ధారపోసిన మొట్ట మొదటి వ్యక్తి పెరియార్‌. ఆయన పూర్తి పేరు ఈ రోడ్‌ వెంకట 

రామస్వామి నాయకర. పెరియార్‌ ఆయనకు ప్రజలిచ్చిన బిరుదు. దీనర్థం పెద్దమనిషి -రుషి లేదా జ్ఞాని. 
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన దశలో- డేరాబాబా లాంటి వాళ్లు పుట్టుకు రావడం, బంగారం -డబ్బులను రెట్టింపు చేస్తామని, మత్తు 

పదార్థాలిచ్చి ఇల్లంతా లూఠీ చేయడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని చుట్టూ అల్లుకున్న విశ్వాసాల కారణంగా ముందుకు 

వస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇట్లా వుంటే ఏ మాత్రం చదువు, శాస్త్ర విజ్ఞానం లేని 90 ఏళ్ళ కిందట ఎలా వుండేదో ఊహించడం అంత కష్టమైన పనేం 

గాదు. అదిగో అలాంటి కాలంలో ప్రజలను చైతన్యం చేయటానికి ప్రధానంగా మూడు రంగాలను ఆయన ఎంచు కున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా 

పోరాడటం, మత విశ్వాసాలు- మూఢ నమ్మకాలు వల్ల కలుగుతున్న నష్టాల మీద ప్రచారం చేయడం, స్త్రీల హక్కుల గురించి పోరాడటం. ఈ మూడు 

రంగాలకు సంబంధించినంత వరకు అపసవ్య ధోరణులున్నాయి. ఇవన్నీ సమాజానికి బ్రాహ్మణిజం నేర్పిన విలువల వల్ల ప్రతిఫలించినవే. దీంతో 

సహజంగానే పెరియార్‌కు బ్రాహ్మణిజం ప్రధాన శత్రువయ్యింది. తరువాతి కాలంలోని కాళోజీలాగే తన జీవితకాలంలో ఎక్కువ సమయం కేటాయించింది 

మాత్రం హేతువాద ప్రచారోద్యమం కోసమే.
పెరియార్‌ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు 

తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి 

ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా 

చేశాయి. తీవ్రమైన విమర్శతో, పదునైన అభివ్యక్తితో-తన ప్రసంగాలు, రచనలు అనేక మందిని హేతు వాదులుగా మార్చాయి. 1925, నవంబరు 23న 

ఆయన ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం విస్తృతమైన కార్యక్రమాలు చేసి, ప్రజల మద్దతు విశేషంగా సంపాదించగలిగింది. అందులో భాగంగానే 

బ్రాహ్మణులు, మంత్రాలు లేని పెళ్ళిళ్లకు రూపకల్పన చేశారు.
సకల మూఢవిశ్వాసాలకు కారణం మతం పేరిట చలామణిలో వున్న గ్రంథాలే. పెరియార్‌ ఆ కారణంగానే రామాయణాన్ని తీవ్రంగా విమర్శించేవారు. 

దాన్ని ఆయన బూటకమైన చిత్ర విచిత్రమైన ఒక చెత్త చరిత్ర అనేవారు. అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేసిన విధంగానే పెరియార్‌ రామాయణ 

గ్రంథాన్ని తగులబెట్టారు. ఒక వర్గం వారికి సమస్త ఆధిపత్యాలను ధారాదత్తం చేస్తూ- శూద్రులు, అతి శూద్రుల పేరిట 95 శాతం ప్రజలకు ఏ విధమైన 

హక్కులు లేకుండా చేసి -వాళ్లు కుక్కలు, కాకులతో సమానమన్న విధంగా, జంతువుల కంటే తక్కువ చేసి చూపిన అలాంటి పుస్తకాలను ఆయన 

వ్యతిరేకించారు. భావజాల పరంగా పెరియార్‌, అంబేద్కర్‌లు దాదాపు ఒకే కుదురుకు చెందిన వాళ్ళు. 1924-25లలో కేరళ రాష్ట్రంలోని వైక్కాం 

దేవాలయ పరిసరాల్లోకి నిమ్నకులాల వాళ్ళను అనుమతించలేదు. ఇటువంటివే ఇతర రెండు మూడు సంఘటనల నేపథ్యంలో పోరాటాలు జరిగాయి. ఈ 

సందర్భంలో బ్రాహ్మణీయ భావజాలన్ని గాంధీ సమర్థించారు. దీంతో ఆయన నుంచి దూరమవటమే కాక ఆయన నడిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని కూడా 

విడిచిపెట్టారు. అంబేద్కర్‌ కూడా గాంధీ భావాలతో తీవ్రంగా పోరాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరేమో అణగారిన వర్గాలవైపు నిలబడి పోరాడుతుంటే 

తాతగారు ప్రజలను అణగదొక్కే వర్గాలవైపు వుండి వీళ్లను వీళ్ల ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలు చేయడం చరిత్రలో దాచినా దాగని సత్యం.
పెరియార్‌ తాను పుట్టిన తమిళనాడుతో పాటు దేశమంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశమంతా పర్యటించి హేతువాద, నాస్తిక భావాలను ప్రచారం చేశారు. 

ఉత్తర భారతీయులు దక్షిణ ప్రాంతమ్మీద చూపిస్తున్న అనేకరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాటాలు లేవనెత్తారు. దక్షిణ భారతదేశమ్మీద హిందీ భాషను 

బలవంతంగా రుద్దటానికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా దక్షిణ భారతీయులందరినీ ఐక్యంగా వుంచడానికి ఆయన 

పడిన శ్రమ చాలా గొప్పది. అందుకోసం 1921 నుంచి అత్యంత క్రియాశీల రాజకీయాలు నెరుపుతున్న 'జస్టిస్‌ పార్టీ' పేరును 1944 ఆగష్టు 27న 

'ద్రవిడ కజగం'గా మార్చారు. దీన్ని సాంస్కృతిక రంగానికి మాత్రమే పరిమితం చేశారు. అనేక సందర్భాలలో తనకు రాజకీయా ధికారం కంటే 

సంస్కరణోద్యమాలే ప్రధానమని ప్రకటించిన గొప్ప వ్యక్తి పెరియార్‌. ఇలాంటి అరుదైన వ్యక్తిని గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం- విద్యా 

వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ(యునెస్కో) 1970 జూన్‌ 27న అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి త్రిగుణసేన్‌ ద్వారా సన్మాన పత్రాన్ని 

బహూకరింపజేసింది. అందులో పేర్కొన్న విధంగానే పెరియార్‌- నవయుగ ప్రవక్త, ఆగేయాసియా సోక్రటీసు, సంఘసంస్కరణా పితామహుడు, 

అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు, అర్థరహితమైన ఆచార సాంప్రదాయాలకు ఆగర్భ శత్రువు.
- తోకల రాజేశం
సెల్‌ : 9676761415

Monday, July 22, 2019

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి కొన్ని ముఖ్య గమనికలు . Harathi Vageeshan

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి  కొన్ని ముఖ్య గమనికలు . 
Harathi Vageeshan
1) సామజిక మాధ్యమాల లో ఇతరత్రా రాతలు రాసే సమయం లో ఆవేశం ప్రధానం గా ఉండకుండా ,ఆలోచన ప్రధానం గా ఉండే రీతిలో రాయాలి
2) దళితులు ఎదురుకునే సమస్యలు ఎక్కువ సార్లు , కేవలం సమస్య ఎదురుకుంటూ ఉన్న వారి వలన మాత్రమే పరిష్కారం కావు, నలుగురు కూడి ఓపికతో కొట్లాడితే ఒక మేరకు అవి పరిష్కారం అవుతాయి కనుక ,క్రియాశీల దళిత కార్యకర్తలకు టీం బిల్డింగ్ పట్ల అవగాహన ఉండాలి , వారు భిన్నమైన తత్వాలు గల మనుషులను ఒక దగ్గరికి చేర్చే నేర్పు నేర్చుకోవాలి .
3) ఎవరైనా తమ వారి లోని ( నాయకులు లేక తోటి వారు ) తప్పులను ,పరిమితులను ఎత్తి చూపే సమయం లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ,ఎక్కువమటుకు అటువంటి చర్చలను బహిరంగంగా కాక పొరపాటు చేసిన మనిషికి( మనుషులకు) హుందాగా అందే టట్టు చూసు కోవాలి .
4) కొన్ని దశాబ్డులు గా దళిత ప్రశ్న మీద పని చేస్తూ అనేక అనుభవాలు పొందిన గట్టి మనుషులు,సమర్థులు , నిరంతరం యువ నాయ కత్వానికి నాయకత్వం అంటే ఏమిటి అన్న అంశాలను అందించాలి .
5) దళిత జీవితాలను మెరుగు పరుచుకోవడానికి ,దళితులమీద జరిగే అమానుష దాడులను ఎదురుకోవడానికి కేవలం ఆవేశం సరిపోదు అని అర్థం చేసుకోవాలి .
6) విపరీతం అయిన నాయకుల ఆరాధన మానివేయాలి .అది నిన్నటి బాబాసాహెబ్ గారుకావచ్చు నేటి మంద కృష్ణ వంటి వారు కావచ్చును .సామజిక పరివర్తనా రంగం లో విపరీతం అయిన పూజ చేసే మానసిక స్థితి చాలా ప్రమాదకరం అది ఆత్మ విమర్శ శక్తిని చంపి వేస్తుంది ,ఆలోచన ను తుంచి వేస్తుంది .
7) చాలా కాలం ప్రజా జీవితంలో ఉండే ప్రతి కార్యకర్తకు చుట్టూ కొంత బృందం తాయారు అవుతుంది , కొంత ప్రభుత్వం తో నూ ఇతరులతోనూ వ్యవహారం జరిపే నేర్పూ వస్తాయి .అయితే వాటిని చూసుకొని అదొక పెద్దవిషయం అయినట్టుఅహంకారాలు పెంచుకొని ముఠాలు కట్టుకునే దౌర్భాగ్యం లోకి పడి పోకూడదు .
* ఒక సామజిక శాస్త్ర విద్యార్థిగా అతి చిన్న సామజిక బాధ్యత లో భాగం గా ఇక్కడ ఇది రాయడం జరిగింది . ఇది ఎవరినీ నొప్పించాలను గానీ ,మెప్పించాలని గానీ రాసింది కాదు అని విన్నవించుకుంటున్నాను .

దళితోద్యమానికి సమీక్షా సమయం - Harathi Vageeshan

దళితోద్యమానికి సమీక్షా సమయం -  Harathi Vageeshan

పదోమ్మిది వందల ఏనబైల నడుమ జరిగిన చుండూరు , కారం చేెడు నరహంతక దాడు ల తరువాత జరిగిన అనేక పోరాటాల వలన , కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెట్టిన వలన విధాన పరం అయిన మార్పులు వచ్చి ,ఏసీ ఎస్టీ అత్యాచార నిరోహక చట్టం వచ్చింది . బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యాచరణ ను ,రచనలు చాలామంది అధ్యయనం చేసే దానికి దారి తీసినాయి . విప్లవ లెఫ్ట్ శిబిరం నుండి అనేక మంది అంబేద్కర్ ను అధ్యయనం చెసే వైపు కదిలినారు . కేవలం రాజ్యం తో సాయుధ పోరు సరిపోదు అనీసామాజిక విశ్లేషణ ,పోరాట రూపాలు , రెండూ మారి పోవాలని ఆలోచన మొదలు అయింది .

ఆ తరువాత పదోమ్మిది వందల తొంభై ల మొదట ( రిజర్వేషన్ పోరాటం ) దండోరా ఉద్యమం పుట్టింది. దళితులకు ఉన్న రిజర్వేషన్ల వర్గీకరణ అనే ప్రధాన డిమాండు తో అది పుట్టింది . అయితే దానికి ఒక ఆత్మగౌరవ పోరాట లక్షణం జోడు అయింది .పేరు చివర మాదిగ అని పెట్టుకోవడం ఒక ధిక్కార స్వరం గా అ పోరాటం మార్చింది . ఎక్కువగా తెలంగాణా లో తెలంగాణా లో ఒక మేరకు ఆంధ్రలో మాదిగ యువ జనం ప్రజా జీవితం లో బలం గా రావడానికి తోడ్పడింది . ప్రతి ఊరి రాజకీయ చిత్రపటం లోకి దండోరా కార్యకర్తలు ప్రవేశం చేయడం జరిగింది .దానికి అది గొప్ప అంశమే .

అయితే మొదటి పోరాటాల తో పోలిస్తే దండోరా ఉద్యమ డిమాండు చిన్నది . మొదలు పడి ఏండ్ల పోరాటం లోపట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ వర్గీకరణ జరిగి ,మాదిగ యువజనం ,మాదిగ కులానికి సమీప వర్తి కులాల వారు కొంత ప్రయోజనం తెలంగాణా లో పొందినారు .తరువాత వర్గీకరణ రద్దు అయింది .

వర్గీకరణ మాత్రమే దళితుల జీవన్మరణ సమస్య కాదు, కానీ అది ముఖ్యం అయిన డిిస్త్రిబ్యూటివ్ జస్టిస్ తో కూడిన సమస్య. ఆ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిన చూపిస్తోఉన్న ఉదాసీనత ,కారణం గా దళితుల నడుమ తీవ్రంగా దూరాలు పెరుగుతూ ఉన్నాయి . దళిత యువత లో ఈ దూరాలు మరీ పెరిగి పోయి కనిపిస్తూ ఉన్నాయి . ముందు మాల మాదిగ దూరాలు గా పెరిగిన ఈ దూరాలు ఇప్పుడు ''అధికారిక మాదిగ నాయకత్వము '' ( అంటే మంద కృష్ణ గారి నాయకత్వం లోని ది ) ,దానికి బయటి మాదిగ నాయకత్వం అనే విభజన కూ గురి అయ్యి ఉన్నది .

దళితులకు అంద వలిసిన సామజిక న్యాయం అన్న భావన లో ఉండి తీర వలిసిన వనరుల మీద హక్కు,సామర్థ్యాల పెంపు , ఆర్థిక వనరుల అందు బాటు వంటి అంశాలు ఉమ్మడి గా చేసే పోరాటాల వలన మాత్రమే సాధ్యం కాగలవు . రిజర్వేషన్ వర్గీకరణ జరిగే లోపు దళితులు కల్సి సాధించుకోవాల్సిన అనేక సమస్యలు ఎజండా లోకి రాక పోవడం పెద్ద సమస్య అయి కూర్చున్నది .

దళిత యువ నాయకత్వానికి ఒక లోతు గల శిక్షణ ఇచ్చే ఉద్యమ వాతావరనం కూడా పలుచ బడినట్టు కనిపిస్తూ ఉన్నది

దళిత ఉద్యమం తెచ్చిన చట్ట పరం అయిన రక్షణలు , తెలుగు రాష్ట్రాల లో ఉన్న స్పెషల్ కంపోనెంటు చట్టం అమలు వంటి వాటి మీద చర్చ సన్నగిల్లింది . చాలా పెద్ద పని జరగవలిసి ఉండగా దానిస్థానం లో ''ఎవరు మాదిగలకు నిజం అయిన ప్రతినిధి ?" అనే చర్చ పెద్దది గా మారి పోతూ ఉన్నది తెలంగాణా లో . మాల కులం దాని సమీప కులాల లోని చాలా మందికి ఈ హానికర మైన దూరాలను ఎట్లా తగ్గించుకోవాలి అనే ప్రశ్న వేసుకుని ఎరుకతో ప్రయతనం చేసి ఉమ్మడి తనాన్ని నిర్మించే స్థితీ కనబడటం లేదు .

ఈ వాతావరణం లో తెలంగాణాలో దళిత క్రియాశీల కార్యకర్తల నడుమ తీవ్ర మనస్పర్ధలు ఏర్పడి వ్యక్తి గత దాడులు కేసులు పెట్టుకోవడం స్థాయికి పోవడం ఆందోళన కరం. మొన్న ప్రొఫెసర్ఇ నాక్ గారిని తెగుడుతూ పలువురు వడిన భాష .నిన్న రాము బీరేల్లిమీద జరిగినదాడి పూర్తీ దూరం దూరం అంశాలు ఏమీ కావు .

సాధికారిక మాదిగ దండోరా తమది అనుకునే వారు ఈ విషయం లో చాలా ఆలోచించాల్సిన అవుసరం ఉంది .

ఇది ఇట్లా ఉండగా 1980 లనుండి పైచేస్తూ ఉన్న దళిత క్రియాశీలురు , ఈప్రయత్నాల మీద మీద కొంత లోతు గల అవగాహన ఉన్న వారు కూర్చుని , ఈ దాదాపు మూడున్నర దశాబ్దాల పయనం లో జరిగినది ఏమిటి ? ఇక ముందు ఏమి జరగాలి ? అని సమీక్ష చేసుకోవాల్సిన అవుసరం ఉంది . ఇది తిట్లూ ,శాపనార్థాలు, హద్దు దాటిన ఎకసెక్కాలు గా ఎట్టిపరిస్తితుల లోనూ మారకుండా చూసుకోవాలి . ఇది అట్లాటి సమీక్ష చేసుకోవలిసిన చారిత్రిక సందర్భం కూడా .

ఇప్పుడు ఇరవై ఒకటవ శతబ్దపు రెండు దశాబ్దాలు గడిచి పొతూ ఉన్నయి .1980 లు తొంబై లనాటి కంటే భిన్నం అయిన ప్రబుత్వ వ్యవస్థ ,ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి .సమాజం కూడా చాలా మార్పులకు లోను అవుతూఉన్నది .

ఈ స్థితి లో ఈ సమీక్షను ఎంత ఆలస్యం చేస్తే దళిత ఉద్యమానికి నష్టం . దళిత ఉద్యమానికే కాదు సానుకూల సమాజిక మార్పు ప్రయత్నాలకు అన్నిటికీ నష్టమే .

Tuesday, July 2, 2019

‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’

‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’
Jul 01, 2019, 16:10 IST
 Mayawati Responds On UP Govts Decision On OBC Castes  - Sakshi
లక్నో : యూపీ ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు. ఎస్సీ క్యాటగిరీలో ఏ ప్రభుత్వమైనా మార్పుచేర్పులను రాజ్యాంగంలోని 341 ఆర్టికల్‌ నిరోధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఓబీసీ వర్గాలు ప్రస్తుతం అటు ఓబీసీలు..ఇటు ఎస్సీలు కాకుండా పోయారని, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని చెప్పారు.

రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె కోరారు. ఎస్సీ కోటాను సైతం అదే నిష్పత్తిలో పెంచాలని మాయావతి సూచించారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనూ దాన్ని వ్యతిరేకించానని ఆమె గుర్తుచేశారు. కాగా యూపీ ప్రభుత్వం రాజ్‌భర్‌, మల్లా, ప్రజాపతి, కుమ్హర్‌ వంటి 17 ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘యూపీ సర్కార్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’

‘యూపీ సర్కార్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’

Jul 02, 2019, 19:21 IST
 Setback For Uttar Pradesh Government Over Obcs Issue - Sakshi
లక్నో : పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఇప్పటికే తప్పుపట్టగా, కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ సైతం యూపీ సర్కార్‌ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 17 అత్యంత వెనుకబడిన కులాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

కోర్టు సైతం సహేతుకం కాదని ప్రకటించిన ఈ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని మంత్రి కోరారు. రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్పీ సభ్యుడు సతీష్‌ మిశ్రా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. రాజ్యాంగంలోని 341 సెక్షన్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారానే ఎస్సీ జాబితాలో ఎలాంటి మార్పుచేర్పులైనా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.