Sunday, September 15, 2019

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
16-09-2019 06:58:22

ఇండోర్ (మధ్యప్రదేశ్) : దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో భారత కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ గోగమెడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికగా కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కల్పించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ డిమాండ్ చేశారు. ‘‘దేశంలో 78 శాతం మంది ప్రజలు రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు. ధనవంతులు, పలుకుబడి ఉన్న వారు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు రిజర్వేషన్లు దక్కడం లేదు.’’ అని సుఖ్‌దేవ్‌సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాకుండా వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పిస్తూ పాలకులు ప్రజలను విభజిస్తున్నారని, అందుకే రిజర్వేషన్లపై 2020లో సమీక్షించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ కోరారు. రిజర్వేషన్ల అమలుపై సమీక్షించాలని, కులాల ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తాము దేశంలో ఆందోళన చేస్తామని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ వివరించారు.

No comments:

Post a Comment