Friday, April 24, 2020

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు - SC

రిజర్వేషన్‌ కులాల జాబితాలు సవరించాలి - SC

Apr 24 2020       @ 02:19 AM హోం జాతీయం

ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారు
అసలైన పేదలకు అందకుండా చేస్తున్నారు
జాబితాలు మార్చరాదన్న రూలేం లేదు
ఆ జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు
మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు
అనుగుణంగా కులాల జాబితాలు మార్చాలి
చాన్స్‌ దక్కనివారు ఆవేదన చెందుతున్నారు
ఏపీ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘‘రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే కులాల జాబితాలు మార్చాల్సిందే..  70 ఏళ్లుగా ఈ ఫలాలను అనుభవిస్తున్న వారు అసలైన పేదలకు అవి దక్కకుండా అడ్డుపడుతున్నారు. వారు దోచుకోకుండా చూడాలంటే కులాల లిస్టులు మార్చాలి. అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ శాతాన్ని మార్చాల్సిన పనిలేదు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు, ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు సూచించినట్లు ఈ జాబితాలను మార్చే పనిని చేపట్టడం ప్రభుత్వ కర్తవ్యం. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నాం....’’

 ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం

పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు

లక్షించారు. కానీ, ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొట్టాయి. జాబితాలు మార్చకుండా, రిజర్వేషన్‌ నిబంధనలను మార్చకుండా అలానే వదిలేశాయి.

సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్‌ కులాల జాబితాలు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులే రిజర్వేషన్‌ ఫలాలు లాక్కుపోతున్నారని, అసలైన పేదలకు, అవి దక్కాల్సినవారికి దక్కకుండా అడ్డుపడుతున్నారని గట్టిగా అభిప్రాయపడింది. ‘‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినపుడే రిజర్వేషన్‌ ఫలాలను -ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’’ అని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ఏరియాల్లో టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అడ్డంగా కొట్టేస్తూ వెలువరించిన 152-పేజీల తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ జాబితాలను నోటిఫై చేస్తారు.


వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నది సుప్రీం బెంచ్‌ తాజా తీర్పు.  ఇందిరా సహానీ (మండల్‌ కమిషన్‌) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ- ‘రిజర్వేషన్‌ కులాల జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు...అవి మార్చకూడదన్న రూలు కూడా ఏమీ లేదు’ అని జడ్జీల్లో ఒకరైన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పష్టం చేశారు. రాకేశ్‌ కుమార్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకిస్తూ- ‘మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా- ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలి’ అని కూడా పేర్కొన్నారు.

‘రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అనేక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇన్నేళ్ల రిజర్వేషన్‌ విధానం వల్ల అనేకులు సంపన్నులయారు. ఇవి అందని వర్గాలనేకం సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ సంపన్నవర్గాలు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఇది అంతర్గతంగా రిజర్వేషన్‌కు అర్హులైన వర్గాల్లోనే ఓ రకమైన ఘర్షణకు దారితీస్తోంది. ఎవరు అర్హులన్న ప్రశ్నకు తావిస్తోంది’ అని జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కులాల జాబితాలు సవరించాలంటూ సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ చేసిన వాదనతో బెంచ్‌ ఏకీభవించింది.

‘‘ప్రభుత్వాలు నియమించిన  కమిషన్లు... కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని, మరికొన్ని వర్గాలను కులాల జాబితాలో చేర్చాలని సూచిస్తూ వచ్చాయి. జాబితాలు సవరించాలని కూడా సిఫారసు చేశాయి. అలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్నపుడు వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ఆ నివేదికలకు అనుగుణంగా జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని కేంద్ర సర్కార్‌కు నివేదించాలి’’ అని బెంచ్‌ పేర్కొంది. (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌ కేసులో షెడ్యూల్డ్‌ ఏరియాలోని టీచింగ్‌ పోస్టులను నూరు శాతం ఎస్టీలకు కేటాయించడం ద్వారా ఎస్సీలకు, బీసీలకు తగిన అవకాశం దక్కకుండా చేశారని బెంచ్‌ అభిప్రాయపడింది. ‘రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం దామాషా ప్రాతిపదిక కాదు.

సరిపడ్డ రీతిలోఈ రిజర్వేషన్‌ కలగజేయడం. రూల్‌ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సినది 6 శాతం రిజర్వేషన్‌ మాత్రమే. ఏకంగా నూరు శాతం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా కలగజేయడం షెడ్యూల్డ్‌ ఏరియాలో నివాసితులు కాని గిరిజనుల హక్కులు కూడా కాలరాయడమే. రాష్ట్రపతి ఉత్తర్వు- 371డీ ప్రకారం వారు మిగిలిన ఏరియాల్లో రిజర్వేషన్లు పొందడానికి వీల్లేకుండా పోతుంది’ అని బెంచ్‌ వివరించింది. కులాల జాబితాలు సవరించనంతకాలం,  కోటా నిబంధనలను సమీక్షించనంతకాలం రిజర్వేషన్ల విధానం విసిరే సవాళ్లను ఎదుర్కొనే రాజకీయ సంకల్పం ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు  ఉండడం కష్టమేనని సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. రాజ్యాధికారంలో భాగం పొందేందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చేసిన యత్నాలు ఫలించడం లేదనీ, వారు వివక్షకు గురవుతున్నారని, అందుకే రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిందనీ వివరించింది. సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం పదేళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు లక్షించారని, కానీ ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొటాయనీ, జాబితాలు మార్చక, రిజర్వేషన్‌ నిబంధనలు మార్చక అలానే వదిలేశాయనీ, ఫలితంగా... ఇవి అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని బెంచ్‌ నిష్కర్షగా విమర్శించింది. పైపెచ్చు.., రిజర్వేషన్‌ శాతం పెంచాలన్న వాదనలు, రిజర్వేషన్లలో సబ్‌ కోటా కోసం డిమాండ్లు క్రమేణా పెరిగిపోయాయని బెంచ్‌ తప్పుబట్టింది.

‘అసలు షెడ్యూల్డ్‌ ఏరియాలు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానం వేరు. సంస్కృతి వేరు. వారి న్యాయ విధానం, సాంస్కృతిక వైరుధ్యం మనలా ఉండవు. అందరికీ అందే విద్య వారికి చేరదు. ఫలితంగా వారు వెనకబడే ఉంటారు. అలాంటి వారికి చేయూతనివ్వాలి. వారిని ఆదిమ సంస్కృతి నుంచి బయటకు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. వారిని జంతుప్రదర్శనశాలలో ఉంచిన మనుషులుగా భావించరాదు. వారి ప్రాచీన నాగరికతను, సంప్రదాయ నృత్యాలను వినోద దృష్టితో చూడరాదు’’ అని బెంచ్‌ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.

రివ్యూ పిటిషన్‌ వేయాలి: తమ్మినేని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2000 సంవత్సరంలో వచ్చిన జీవో నం.3ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు అమలు జరగకుండా ేస్టఆర్డర్‌ పొందేలా తక్షణం జోక్యం చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

వేల మంది నష్టపోయారు

సుప్రీం తీర్పుపై పిటిషనర్‌ లీలాప్రసాద్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఏజెన్సీలో నూటికి నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే ఉండాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం దాకా వేలాది మంది గిరిజనేతర నిరుద్యోగులు నష్టపోయారని, వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని పిటిషనర్‌ చేబ్రోలు లీలాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమీక్షించి తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.  అప్పట్లో ఖమ్మం జిల్లాలో 2వేల పోస్టులు గిరిజనులకు కేటాయించారని, తద్వారా అన్ని అర్హతలున్నా ఉపాధ్యాయ పోస్టుకు తమని అనర్హులను చేశారని వాపోయారు. టీచరుగా పనిచేయాలన్న తన నెరవేరకుండా పోయిందంటూ...  ఇప్పుడు తనకు 40 ఏళ్లని, ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేదని, చిన్నరైతుగా చింతకాని మండలం పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నానని వివరించారు. అప్పట్లోనే తీర్పు వచ్చి ఉంటే తమ లాంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవని, ఇప్పుడు వచ్చిన తీర్పు ద్వారా న్యాయం గెలించిందన్న సంతృప్తి ఉన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుపొందలేదన్న బాధ ఉందన్నారు.

Thursday, April 16, 2020

అమెరికా కాంగ్రెస్‌లో ‘అంబేడ్కర్‌’

అమెరికా కాంగ్రెస్‌లో ‘అంబేడ్కర్‌’

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు అమెరికా కాంగ్రెస్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆధునిక సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అంబేడ్కర్‌ సేవలను గుర్తిస్తూ ప్రతినిధుల సభలో తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆ రోజున కాంగ్రెస్‌ ప్రతినిధి రో ఖన్నా సభలో ఈ తీర్మానాన్ని పెట్టారు. భారత్‌లో అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ పోరాటం చేసి విజయం సాధించారని ఆయన తెలిపారు.  

Monday, April 13, 2020

Statement condemning the impending arrest of Prof Anand Teltumbde

Statement condemning the impending arrest of Prof Anand Teltumbde and demanding that trumped up charges against him be dropped
08 April 2020

An illustration depicting the scholar and activist Anand Teltumbde with BR Ambedkar. Teltumbde is married to Ramabai Anandrao Teltumbde, Ambedkar’s only granddaughter. On 8 April, the Supreme Court granted Teltumbde one week to surrender in the Bhima Koregaon case. Two days earlier, the All India Forum for Right to Education had issued a statement on condemning the impending arrest of Teltumbde. 

SIDDHESH GAUTAM / COURTESY PRACHI TELTUMBDE

On 16 March 2020, a Supreme Court bench comprising the judges Arun Mishra and Mukeshkumar Rasikbhai Shah rejected the anticipatory bail pleas of the civil-rights activist Gautam Navlakha and the writer Teltumbde, in relation to the violence at Bhima Koregaon in January 2018. Navlakha and Teltumbde were booked by the Pune Police under the draconian Unlawful Activities (Prevention) Act for alleged Maoist links in 2018. The Supreme Court asked Navlakha and Teltumbde to surrender on 6 April. On 8 April, the Supreme Court granted the activists Gautam Navlakha and Anand Teltumbde one week to surrender in the Bhima Koregaon case, registered under the draconian UAPA. The All India Forum for Right to Education organised a virtual press conference on 6th April 2020 to register its strongest condemnation of the impending arrest of Prof. Anand Teltumbde. The full, unedited text of the statement is below.

All-India Forum for Right to Education organised a virtual press conference on 6th April 2020 to register its strongest condemnation of the impending arrest of Prof. Anand Teltumbde, Member Presidium of AIFRTE and Senior Professor and Chair Big Data Analysis, Goa Institute of Management, on April 6, 2020. The Supreme Court had denied him anticipatory bail on the demand of the NIA although he had been fully co-operating with investigating agencies.

Notwithstanding the pandemic generated national lockdown, the activists and intelectuals associated with AIFRRTE took up a vigorous public campaign in solidarity with Prof. Anand Teltumbde. Initiating the press-conference, AIFRTE Organising Secretary Dr Vikas Gupta informed that keeping in view the ongoing nationwide lockdown, a massive social media and online campaign has been initiated by AIFRTE in support of Prof Anand Teltumbde. This includes an online petition signed by more than 2000 persons including leading intellectuals; twitter messages shared by more than 15,000 persons including many celebrities; and a hunger strike by nearly 45 people in the country on 6th April (Annexure 2). On humanitarian grounds under covid-19 Pandemic, and given the questionable charges against him, AIFRTE has forwarded a petition signed by almost two thousand citizens to the President and the Chief justice of India to stop Prof. Teltumbde’s arrest and further to drop the ill-conceived case against him while also appealing to the Prime Minister and the Central Home Minister to issue instructions to the concerned authorities accordingly. Several organisations from Punjab also expressed solidarity with Anand Teltumbde and Gautam Navlakha (Annexure 3). 

The conference was addressed by Prof. Jagmohan Singh (Ludhiana, Punjab), Chairperson, AIFRTE;  Prof. G. Haragopal (Telungana), Presidium Member of AIFRTE (in absentia, statement in Annexure 1); Prof. Madhu Prasad (Delhi University, Spokes Person, AIFRTE( in absentia, statement in Annexure 1); Prof. K. Chakradhar Rao (Hyderabad), Member, Presidium, AIFRTE; Prof. Anil Sadgopal (Bhopal/former Dean, Faculty of Education, DU), Member, Presidium, AIFRTE; Sh. Ramesh Patnaik (Guntur, Andhra Pradesh), Member, Presidium, AIFRTE; Prof. Nandita Narain  (former President, DUTA and FedCUTA, Delhi); Prof. Ganesh Devy (Dharwad, Karnataka), President, Rashtra Sewa Dal (in absentia, statement in Annexure 1); Prof. Hanibabu MT (Delhi University); Prof. Chaman Lal (Delhi), Former Professor, JNU & Chairperson, Shaheed Bhagat Singh Study Group;  Prof. Manoranjan Mohanty (Bhubaneswar), Former Professor, Delhi University and Council for Social Development; and others. 

The speakers highlighted that the state action against Anand Teltumbde and Gautam Navlakha is part of a larger pattern of state assault on the democratic rights and liberties of the people and on principles of equity and justice that lie at the very foundation of our republic. They underlined the need for all democratic and progressive forces to come together and welcomed their joint action in this campaign as a positive sign. They underlined that the case against Anand Teltumbde is not based on any information or documentation found in his possession. It relies only on reference to someone referred to as Anand in a letter found on the computer of Rona Wilson. The veracity of the documents found on the computer are themselves in doubt as experts have discovered the possibility of remote access to and planting of documents in the said computer. As such any documents sourced from this computer can hardly be treated as ‘evidence’.

The panellists underlined that Prof. Teltumbde is not merely a member of the family of Dr B.R. Ambedkar but also a renowned academician and a leading civil liberties activist. His theoretical and senior managerial contribution to the development of the IT sector and the Oil and Gas sector [and] in India is widely recognized and he has received several prestigious awards for his writing and work in these areas. 

AIFRTE firmly believes that the case filed against him under the draconian UAPA which allows for indefinite incarceration without trial, is motivated with the intention of silencing a significant critical voice against anti-democratic policies and practices of the government. This includes Prof. Teltumbde’s stand against the NEP 2020 as it is against the core features of Indian Constitution including reservation and social justice.  It is an outrageous attempt to harass a leading figure in the civil liberties movement although it claims to have ‘discovered’ his links with banned Maoist Organisations. This is even more shocking as Prof. Teltumbde is a consistent adherent to principles of non-violence and has at no point in his prominent role in the democratic movement in defence of civil liberties ever participated in, or given support to, violent or unlawful methods of struggle.

Today in the grip of the deadly Corona Virus pandemic, when governments are releasing convicts and under trials on parole because overcrowded prisons present a grave threat, it is appalling that an innocent person and one who is recognized as a significant contributor to the country’s development should be denied anticipatory bail. Prof. Teltumbde is 68 years and a chronic asthmatic and hence is in the highest target category threatened with the Novel Corona virus.

Please visit the following web-page for further details about Prof. Teltumbde; the concocted Police Plot; AIFRTE’s online petition at change.org in various languages; solidarity campaign as well as AIFRTE’s appeals to the CJI and the President of India [etc].

Who is Anand Teltumbde, and why was he arrested recently?

Who is Anand Teltumbde, and why was he arrested recently?
G. SampathFEBRUARY 16, 2019 20:09 IST
UPDATED: FEBRUARY 16, 2019 20:38 IST
SHARE ARTICLE 1PRINTA A A
BANGALORE, 16/04/2011: Scholar Anand Teltumbde at an interview with The Hindu, in Bangalore on April 16, 2011. Photo: V. Sreenivasa Murthy
BANGALORE, 16/04/2011: Scholar Anand Teltumbde at an interview with The Hindu, in Bangalore on April 16, 2011. Photo: V. Sreenivasa Murthy  

Academic and columnist Anand Teltumbde is not only one of India’s foremost public intellectuals, he is also someone known for speaking truth to power. In his column ‘Margin Speak’ in the Economic and Political Weekly, he has been scathing in his criticism of the Narendra Modi government, especially over issues of social welfare, communal harmony, and the persecution of social activists.

Why was he arrested?
On August 29 last year, Mr. Teltumbde himself became the target of state action when law enforcement officials raided his home in Goa, where he is a faculty member of the Goa Institute of Management. The raid was reportedly in connection with his alleged links to the Bhima Koregaon violence of January 1, 2018. The Maharashtra police also claimed that he was involved in a Maoist plot to assassinate Prime Minister Narendra Modi. It booked him under the Unlawful Activities (Prevention) Act, a law that makes it extremely difficult for the accused to obtain bail. Mr. Teltumbde has rubbished these allegations. He approached the Supreme Court to have the First Information Report (FIR) against him quashed. On January 14 this year, the Supreme Court refused to quash the FIR, but gave him four weeks to apply for anticipatory bail. On February 1, a Pune court rejected his application for anticipatory bail, with the additional sessions judge K.D. Vadane observing that “there is sufficient material collected by the investigating officer to show the involvement of the present accused in the commission of the offence.”

Mr. Teltumbde then appealed to the Bombay High Court, and it was while he was travelling to Mumbai to meet his lawyer that the Pune police arrested him at the airport at 3.30 a.m. on February 3. The arrest sparked immediate outrage on social media as the Supreme Court’s protection against arrest was in force till February 11. When he was produced in court later that day, the same judge who had rejected his bail application ordered his immediate release, noting that the Supreme Court’s order “is an umbrella protection for four weeks and [Mr.] Teltumbde can avail himself of all options available to him within this period.”

Where does he hail from?
Mr. Teltumbde was born in a small village called Rajur in Maharashtra’s Yavatmal district. After a degree in Mechanical Engineering and a Ph.D. in cybernetic modelling, he enjoyed a successful career as a management professional. But alongside that, Mr. Teltumbde was a civil rights activist. In his writings, he combines an Ambedkarite perspective with a Marxist understanding of political economy. His books, most notably Khairlanji: A Strange and Bitter Crop and Republic of Caste, are a searing indictment of the Indian republic’s failure to seriously confront the challenges of caste violence and injustice.

Where does he stand?
On January 1, 2018, when lakhs of Dalits gathered at the Bhima Koregaon war memorial to celebrate the 200th anniversary of the 1818 Battle of Koregaon, violence broke out, and one person was killed. The police said the violence was incited by participants of the Elgaar Parishad, held by 260 non-profit groups on December 31, 2017 in Pune’s Shaniwar wada. Ten activists and intellectuals were arrested on the charges of having Maoist links, instigating the Bhima Koregaon violence and plotting to assassinate the Prime Minister. The police want to add Mr. Teltumbde to the list of arrested suspects.

What lies in store?
On February 11, the Bombay High Court extended Mr. Teltumbde’s interim protection against arrest till February 22. Mr. Teltumbde has maintained that the charges are fabricated, and represent nothing but an attempt to clamp down on dissent.

Day before surrendering to NIA, Anand Teltumbde writes to the people of India

Day before surrendering to NIA, Anand Teltumbde writes to the people of India
Sonam SaigalMUMBAI, APRIL 14, 2020 04:03 IST
UPDATED: APRIL 14, 2020 04:03 IST
SHARE ARTICLE 0PRINTA A A
Anand Teltumbde
Anand Teltumbde   | Photo Credit: Mandar Tannu

‘I earnestly hope that you will speak out before your turn comes’
Professor Anand Teltumbde, an engineer and Indian Institute of Management (IIM) graduate who used to teach at the Indian Institute of Technology (Kharagpur), wrote an open letter ‘to the people of India’ a day before he surrenders to the National Investigation Agency (NIA) after the Supreme Court denied him any relief.

“I am aware this may be completely drowned in the motivated cacophony of the BJP-RSS combine and the subservient media but I still think it may be worth talking to you as I do not know whether I would get another opportunity,” Mr. Teltumbde noted in his three-page letter.

He said his ‘world turned completely topsy-turvy’ in August 2018 when a team of policemen raided his house in the faculty housing complex of Goa Institute of Management and accused of him having a connection with the Bhima-Koregaon violence.


“Although, I was aware that police used to visit the organisers of my lectures, mostly universities, and scare them with enquiries about me, I thought they might be mistaking me for my brother who left family years back,” the letter said. But everything changed for him when the director of his institute called him, while he was in Mumbai on an official visit, and told him the police had raided the campus looking for him.

VDO.AI

Also read: Who is Anand Teltumbde, and why was he arrested recently?

The police team which raided the institute forcibly got a duplicate key from the security guard, and took videos of his house, claimed Mr. Teltumbde. “Our ordeal began right there,” he said. On the advice of lawyers, he asked his wife to take the next flight to Goa and lodge a complaint with the Bicholim police station stating that their house had been opened in their absence and they would not be responsible if police officials had planted anything. His wife also volunteered to give their telephone number if the officials wanted to conduct inquiries.

Mr. Teltumbde said that in his voluminous writings, which include 30 books, some published internationally, there has not been any insinuation of support to violence or any subversive movement. “But at the fag end of my life, I am being charged for the heinous crime under the draconian UAPA.”

Also read: ‘At least delay the arrest of Teltumbde, Navlakha’

According to him, the details of the case are strewn across the internet and are enough for any person to know that it is a “clumsy and criminal fabrication.”

Mr. Teltumbde’s letter reads, “I am implicated on the basis of the five letters among 13 that the police purportedly recovered from the computers of two arrestees in the case. Nothing has been recovered from me. The letters refer to ‘Anand’, a common name in India, but the police unquestioningly identified it with me.”

Also read: Anand Teltumbde’s release just interim relief, says activists

The professor said the form and content of the letters has been trashed by experts and even a justice of the Supreme Court, the only one in the entire judiciary who went into the nature of the evidence. Additionally, the content does not refer to anything that could be remotely construed as even a simple crime, he claims.

“But taking shelter under the draconian provisions of the UAPA, that renders a person defenseless, I am being jailed,” Mr. Teltumbde said, adding, “And this can happen literally to ANYONE.”

“As I see my India being ruined, it is with a feeble hope that I write to you at such a grim moment. Well, I am off to NIA custody and do not know when I shall be able to talk to you again. However, I earnestly hope that you will speak out before your turn comes,” the letter concluded.

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు
ఇవ్వాళ కరోనా అందరినీ గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాలు పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పడే ఆనంద్‌ తేల్తుంబ్డే లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదనలు వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా. అంబేడ్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది.

యాదృచ్ఛికమే ఐనా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి రోజే డా. అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు ఆయన మేధో వారసుడు అరుదైన మేధావి ఆనంద్‌ తేల్తుంబ్డే జైలులోకి వెళ్ళవలసి రావడం ఒక పెద్ద చారిత్రక విషాదం. స్వాతంత్య్రానంతరంలో అతి పేద దళిత కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ తెల్తుంబ్డే డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కేవలం తన స్వయంశక్తితో అత్యంత ప్రతిభావంతుడైన మేధావిగా ఎదిగాడు. బహుశా నాకు తెలిసి అంబేడ్కర్‌ రచనలను అంత క్షుణ్ణంగా చదివిన వారు చాలా తక్కువ. ఆనంద్‌ అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేయడమే కాక మార్క్సిజాన్ని కూడా అంతే లోతుగా అన్వేషించాడు. మార్క్సిజం చారిత్రక, తాత్విక, నైతిక కోణాలని చాలా సమగ్రంగా చాలా నిశితంగా అధ్యయనం చేసాడు. చాలా ఆశ్చర్యంగా గాంధీజీ రచనలను కూడా చాలా గౌరవంగా చదవడమే కాక, గాంధీని భారత సమాజం మరింత పరిణతితో అంచనా వేయాలని వాదిస్తాడు. ఈ మూడు ఆలోచనా స్రవంతుల ప్రభావం ఆయన రచించిన 29 గ్రంథాలలో చూడవచ్చు. ఈ గ్రంథాలన్నీ ఆనంద్‌ మేధో శిఖరాలకి అద్దం పడతాయి.

ఆనంద్‌ చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. పేదరికం వలన సెలవుల్లో ఇళ్ళకు సున్నాలు వేసిన ఆదాయంతో చదువుకున్నాడు. ఆనంద్‌ తల్లిని కలిసినప్పుడు– మీ అబ్బాయికి చాలా పేరు ప్రతిష్టలున్నవి, మంచి అబ్బాయికి తల్లి మీరు అని అంటే అమాయకంగా నా ముఖమంతా తన చేతులతో అప్యాయంగా తరిచింది. మనసంతా ప్రేమతో నిండిన మనిషిలా అనిపించింది. ఆనంద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు, ఆ తర్వాత బాంబే విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ చేసాడు. దాంతో బాటు ప్రతిష్ఠాత్మాకమైన అహ్మదాబాద్‌ ఐ.ఐ.యం నుండి మేనేజ్‌మెంట్‌లో పట్టా సాధించాడు. సాంకేతిక రంగంలో ఆధునిక ఐ.టి. రంగంలో మెగా అనలిటిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. కొంత కాలం బహుళ జాతి కంపెనీలో పని చేసి, భారత్‌ పెట్రోలియం కంపెనీలో ఎండిగా అలాగే సిఇఓగా పని చేసాడు. ఆయనకుండే అనుభవం వలన భారత ప్రభుత్వం ఆయనకు పెట్రోనెట్‌ ఇండియా లిమిటెడ్‌లో బాధ్యతలను అప్పచెప్పింది. ఈ అపార అనుభవం వలన ఆయనను మరో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి ఖరగ్‌పూర్‌ ఆచార్యుడిగా ఆహ్వానించి, మేనేజ్‌మెంట్‌ ఎకనామిక్స్‌ బోధన బాధ్యతను అప్పచెప్పింది. అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడే గోవా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెగా డేటా అనలిటిక్‌ బోధించడానికి ఆహ్వానించింది. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన కేవలం ఇరవై మంది నిష్ణాతులలో ఆనంద్‌ ఒకరు. నిజానికి ఈ అర్హతల వలన కర్ణాటక విశ్వవిద్యాలయము ఆయనకు గౌరవ డాక్టరేటునిచ్చి గౌరవించింది.

ఆనంద్‌ ఈ రంగాలకే పరిమితమై ఉంటే బహుశా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ అవార్డులే ఇచ్చేది. చాలా మంది సాంకేతిక నిపుణుల వలే కేవలం తమ రంగం తప్ప దేనిని పట్టించుకునే మనస్తత్వం కాక, ఆనంద్‌కు ఉండే సామాజిక నేపథ్యం వల్ల సమాజంలో ఉండే వివక్ష, అసమానతలు, పేదరికం, కుల వ్యవస్థ, నిరుద్యోగం, భూమి సమస్య, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద దోపిడీ, భూస్వామ్య సంబంధాలు, విద్య, వైద్యం లాంటి సమస్యల మీద స్పందిస్తూ ఒక వైపు తన సాంకేతికపర బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరంగా ఈ సమస్యలన్నింటి మీద రచనలు చేసాడు. ఉదాహరణకు ఆయన రచించిన ప్రామాణిక గ్రంథం ‘కైర్లాంజీ’ కేవలం పది రోజుల్లో అదీ చైనాలోని బీజింగ్‌ నుండి కెన్యాకు ప్రయాణిస్తూ విమానంలో, విమానాశ్రయంలో గడిపిన సమయంలో వ్రాసాడు. నవయానా అనే ప్రచు రణ సంస్థ బాధ్యుడు ఎస్‌. ఆనంద్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్‌ ఎంతో సృజనపరుడని పేర్కొన్నాడు.

బ్రాహ్మణీయ భావజాలం, కుల వ్యవస్థ, నియో లిబరలిజం, భూస్వామ్యం, అన్నింటికి మించి దేశంలో బలపడుతున్న ఫాసిస్టు శక్తుల మీద ఆయన లోతైన రచనలు చేయడమే కాక, దేశంలోని పేద వర్గాలని డా.అంబేడ్కర్‌ సూచించినట్లుగా ఎడ్యుకేట్‌ చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. పేదవర్గాల మీద ప్రత్యేకంగా దళితుల మీద దాడులు జరిగితే తాను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ వైపు నిలబడ్డాడు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాతపల్లెలో దళితుల మీద బోయలు దాడి చేసినప్పుడు రెండు పర్యాయాలు రావడమే కాక వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేసాడు. డా.అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు వచ్చాడనేది పెద్ద వార్త అయ్యింది. నేను పాతపల్లికి వెళ్లినప్పుడు బోయలు అంబేద్కర్‌ మనుమడు వచ్చేంత పెద్ద నేరం మేం ఏం చేసాం అని అన్నారు. ఆనంద్‌ ప్రమేయం వల్ల జిల్లా యంత్రాంగం కూడా కదిలింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఇంత అరుదైన మనిషిని ఉపా చట్టం క్రింద అరెస్టు చేయడం ద్వారా రాజ్యం ఏ దిశగా పోతుందో స్పష్టంగా చూడవచ్చు. ఇంతకు ఆనంద్‌ చేసిన నేరమేమిటి, ఆయన మీద మోపిన నేరం భీమాకోరేగాం సంఘటనతో సంబంధమున్నదని, భీమాకోరేగాం మావోయిస్టు పార్టీ ప్రోద్బలంతో జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. భీమాకోరేగాం నిజానికీ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాజకీయ ఉద్యమ కృషిలో భాగం. దాదాపు రెండు శతాబ్దాల క్రితం బ్రాహ్మణ పీష్వాలను ఓడించిన బ్రిటిష్‌ సైన్యంలో దళితులు కీలక పాత్ర నిర్వహించారు. ఈ సంఘటన ద్వారా దళితుల్లో చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని డా.అంబేడ్కర్‌ ఆలోచించారు. ఎన్నడు లేనిది 2018లోనే ఇది వివాదస్పదంగా మారింది. దానిని కేంద్ర, మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు వ్యతిరేకించి దేశంలోని పదకొండు మంది అత్యంత ప్రతిభావంతులను అరెస్టు చేసింది. జీవితంలో ఉన్నత విలువలని, ప్రమాణాలని ఆచరిస్తున్నవారు, వ్యవస్థతో రాజీ పడితే ఏ బిరుదులైనా, ఏ పదవులైనా పొందగలిగి జీవితంలో సుఖంగా జీవించగలిగే వారు ఈ విధంగా ఇవ్వాళ జైలులో బంధింపబడ్డారు. మొదట తొమ్మిది మందిని పునా పోలీసులు అరెస్టు చేసారు. ఇందులో ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవాలాఖాలు బయట ఉండిపోయారు. ఆనంద్‌ విషయంలో బాంబే హైకోర్టు, అలాగే నవాలాఖా విషయంలో ఢిల్లీ హైకోర్టు కొన్ని సాంకేతిక లోపాల వలన స్టే ఇచ్చారు. ఈ స్టే కొనసాగుతున్న కాలంలోనే మహారాష్ట్రలో బిజెపికి అధికారం పోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భీమా కోరేగాం సంఘటన అలాగే ప్రధానమంత్రి మీద హత్యకు కుట్ర, అన్నవి కేవలం కల్పితమని ఇవి అమాయకుల మీద రుద్దబడ్డ కేసులని ఎన్‌.సి.పి. ప్రముఖుడు సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ మేము ఆయనను కలసినప్పుడు మాతో అన్నాడు. ఈ కేసును తామే సమీక్షిస్తామని నిర్ణయించడంతో దాదాపు 18 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం కేసును మహారాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తప్పించి తామే దీనిని ఎన్‌.ఐ.ఎ. ద్వారా డీల్‌ చేస్తామని తమ పరిధిలోకి తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవలఖాల స్టేను ఎత్తి వేయించి వాళ్ల అరెస్టుకు ఆదేశించారు.

ఆనంద్‌ అరెస్టును దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నోవ్‌ుచాంస్కీతో సహా చాలా మంది నిరసించారు. ఆయన అరెస్టు అవుతారనే వార్త రావడంతో దాదాపు పదిహేను వేల ట్వీట్స్‌ దానిని వ్యతిరేకిస్తూ రావడం చూస్తే ఆయనకుండే మద్దతు ఏంటో తెలుస్తుంది. ఆనంద్‌ అఖిల భారతీయ విద్యా హక్కు ఫోరంలో అధ్యక్ష వర్గ సభ్యుడు. ఈ ఫోరం ఆనంద్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టింది. విద్య అందరికీ సమానంగా, నాణ్యంగా, ఉచితంగా అందుబాటులోకి రావాలని గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నది. ఈ పోరాటంలో ఆనంద్‌ అగ్రభాగాన ఉన్నాడు. ఒకవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. మానవాళి భవిష్యత్తేమిటో తేల్చుకోమంటున్నది. ఒక కనిపించని నిర్జీవి ప్రపంచాన్నంతా జైళ్ళలోకి నెట్టింది. ఇంట్లో నుండి కదలడానికి వీల్లేదంటున్నది. భీమా కోరేగాం సంఘటనలో వరవరరావులాంటి మిత్రులను గృహనిర్బంధం అని కొంతకాలం ఇంట్లోనే నిర్బంధించారు. ఇవ్వాళ కరోనా అందరిని గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాల పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పుడే ఆనంద్‌ లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదించినా వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా.అంబేద్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది. అంబేడ్కర్‌ మీద గౌరవ సూచనగా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘‘ఒకవైపు అంబేద్కర్‌ మీద గౌరవం చూపిస్తూనే ఆయన కుటుంబ సభ్యుడిని జైలు పాలు చేయడంలో ప్రభుత్వ ద్వందత్వం కనిపిస్తుందని’’ అని ఆనంద్‌ అనడం అందరిని ఆలోచింపచేస్తున్నది. రాజ్యం తన స్వభావాన్ని తనకు తెలియకుండానే బహిర్గత పరుస్తుందనడానికి ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు.

ప్రొ. జి.హరగోపాల్‌

Sunday, September 15, 2019

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై కర్ణిసేన అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
16-09-2019 06:58:22

ఇండోర్ (మధ్యప్రదేశ్) : దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో భారత కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ గోగమెడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికగా కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కల్పించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ డిమాండ్ చేశారు. ‘‘దేశంలో 78 శాతం మంది ప్రజలు రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు. ధనవంతులు, పలుకుబడి ఉన్న వారు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు రిజర్వేషన్లు దక్కడం లేదు.’’ అని సుఖ్‌దేవ్‌సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాకుండా వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పిస్తూ పాలకులు ప్రజలను విభజిస్తున్నారని, అందుకే రిజర్వేషన్లపై 2020లో సమీక్షించాలని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ కోరారు. రిజర్వేషన్ల అమలుపై సమీక్షించాలని, కులాల ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తాము దేశంలో ఆందోళన చేస్తామని కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్ వివరించారు.