Monday, July 22, 2019

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి కొన్ని ముఖ్య గమనికలు . Harathi Vageeshan

దళిత ఉద్యమం లో క్రియాశీలంగ పనిచేసే వారికి  కొన్ని ముఖ్య గమనికలు . 
Harathi Vageeshan
1) సామజిక మాధ్యమాల లో ఇతరత్రా రాతలు రాసే సమయం లో ఆవేశం ప్రధానం గా ఉండకుండా ,ఆలోచన ప్రధానం గా ఉండే రీతిలో రాయాలి
2) దళితులు ఎదురుకునే సమస్యలు ఎక్కువ సార్లు , కేవలం సమస్య ఎదురుకుంటూ ఉన్న వారి వలన మాత్రమే పరిష్కారం కావు, నలుగురు కూడి ఓపికతో కొట్లాడితే ఒక మేరకు అవి పరిష్కారం అవుతాయి కనుక ,క్రియాశీల దళిత కార్యకర్తలకు టీం బిల్డింగ్ పట్ల అవగాహన ఉండాలి , వారు భిన్నమైన తత్వాలు గల మనుషులను ఒక దగ్గరికి చేర్చే నేర్పు నేర్చుకోవాలి .
3) ఎవరైనా తమ వారి లోని ( నాయకులు లేక తోటి వారు ) తప్పులను ,పరిమితులను ఎత్తి చూపే సమయం లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ,ఎక్కువమటుకు అటువంటి చర్చలను బహిరంగంగా కాక పొరపాటు చేసిన మనిషికి( మనుషులకు) హుందాగా అందే టట్టు చూసు కోవాలి .
4) కొన్ని దశాబ్డులు గా దళిత ప్రశ్న మీద పని చేస్తూ అనేక అనుభవాలు పొందిన గట్టి మనుషులు,సమర్థులు , నిరంతరం యువ నాయ కత్వానికి నాయకత్వం అంటే ఏమిటి అన్న అంశాలను అందించాలి .
5) దళిత జీవితాలను మెరుగు పరుచుకోవడానికి ,దళితులమీద జరిగే అమానుష దాడులను ఎదురుకోవడానికి కేవలం ఆవేశం సరిపోదు అని అర్థం చేసుకోవాలి .
6) విపరీతం అయిన నాయకుల ఆరాధన మానివేయాలి .అది నిన్నటి బాబాసాహెబ్ గారుకావచ్చు నేటి మంద కృష్ణ వంటి వారు కావచ్చును .సామజిక పరివర్తనా రంగం లో విపరీతం అయిన పూజ చేసే మానసిక స్థితి చాలా ప్రమాదకరం అది ఆత్మ విమర్శ శక్తిని చంపి వేస్తుంది ,ఆలోచన ను తుంచి వేస్తుంది .
7) చాలా కాలం ప్రజా జీవితంలో ఉండే ప్రతి కార్యకర్తకు చుట్టూ కొంత బృందం తాయారు అవుతుంది , కొంత ప్రభుత్వం తో నూ ఇతరులతోనూ వ్యవహారం జరిపే నేర్పూ వస్తాయి .అయితే వాటిని చూసుకొని అదొక పెద్దవిషయం అయినట్టుఅహంకారాలు పెంచుకొని ముఠాలు కట్టుకునే దౌర్భాగ్యం లోకి పడి పోకూడదు .
* ఒక సామజిక శాస్త్ర విద్యార్థిగా అతి చిన్న సామజిక బాధ్యత లో భాగం గా ఇక్కడ ఇది రాయడం జరిగింది . ఇది ఎవరినీ నొప్పించాలను గానీ ,మెప్పించాలని గానీ రాసింది కాదు అని విన్నవించుకుంటున్నాను .

No comments:

Post a Comment