Monday, July 22, 2019

దళితోద్యమానికి సమీక్షా సమయం - Harathi Vageeshan

దళితోద్యమానికి సమీక్షా సమయం -  Harathi Vageeshan

పదోమ్మిది వందల ఏనబైల నడుమ జరిగిన చుండూరు , కారం చేెడు నరహంతక దాడు ల తరువాత జరిగిన అనేక పోరాటాల వలన , కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెట్టిన వలన విధాన పరం అయిన మార్పులు వచ్చి ,ఏసీ ఎస్టీ అత్యాచార నిరోహక చట్టం వచ్చింది . బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యాచరణ ను ,రచనలు చాలామంది అధ్యయనం చేసే దానికి దారి తీసినాయి . విప్లవ లెఫ్ట్ శిబిరం నుండి అనేక మంది అంబేద్కర్ ను అధ్యయనం చెసే వైపు కదిలినారు . కేవలం రాజ్యం తో సాయుధ పోరు సరిపోదు అనీసామాజిక విశ్లేషణ ,పోరాట రూపాలు , రెండూ మారి పోవాలని ఆలోచన మొదలు అయింది .

ఆ తరువాత పదోమ్మిది వందల తొంభై ల మొదట ( రిజర్వేషన్ పోరాటం ) దండోరా ఉద్యమం పుట్టింది. దళితులకు ఉన్న రిజర్వేషన్ల వర్గీకరణ అనే ప్రధాన డిమాండు తో అది పుట్టింది . అయితే దానికి ఒక ఆత్మగౌరవ పోరాట లక్షణం జోడు అయింది .పేరు చివర మాదిగ అని పెట్టుకోవడం ఒక ధిక్కార స్వరం గా అ పోరాటం మార్చింది . ఎక్కువగా తెలంగాణా లో తెలంగాణా లో ఒక మేరకు ఆంధ్రలో మాదిగ యువ జనం ప్రజా జీవితం లో బలం గా రావడానికి తోడ్పడింది . ప్రతి ఊరి రాజకీయ చిత్రపటం లోకి దండోరా కార్యకర్తలు ప్రవేశం చేయడం జరిగింది .దానికి అది గొప్ప అంశమే .

అయితే మొదటి పోరాటాల తో పోలిస్తే దండోరా ఉద్యమ డిమాండు చిన్నది . మొదలు పడి ఏండ్ల పోరాటం లోపట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ వర్గీకరణ జరిగి ,మాదిగ యువజనం ,మాదిగ కులానికి సమీప వర్తి కులాల వారు కొంత ప్రయోజనం తెలంగాణా లో పొందినారు .తరువాత వర్గీకరణ రద్దు అయింది .

వర్గీకరణ మాత్రమే దళితుల జీవన్మరణ సమస్య కాదు, కానీ అది ముఖ్యం అయిన డిిస్త్రిబ్యూటివ్ జస్టిస్ తో కూడిన సమస్య. ఆ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిన చూపిస్తోఉన్న ఉదాసీనత ,కారణం గా దళితుల నడుమ తీవ్రంగా దూరాలు పెరుగుతూ ఉన్నాయి . దళిత యువత లో ఈ దూరాలు మరీ పెరిగి పోయి కనిపిస్తూ ఉన్నాయి . ముందు మాల మాదిగ దూరాలు గా పెరిగిన ఈ దూరాలు ఇప్పుడు ''అధికారిక మాదిగ నాయకత్వము '' ( అంటే మంద కృష్ణ గారి నాయకత్వం లోని ది ) ,దానికి బయటి మాదిగ నాయకత్వం అనే విభజన కూ గురి అయ్యి ఉన్నది .

దళితులకు అంద వలిసిన సామజిక న్యాయం అన్న భావన లో ఉండి తీర వలిసిన వనరుల మీద హక్కు,సామర్థ్యాల పెంపు , ఆర్థిక వనరుల అందు బాటు వంటి అంశాలు ఉమ్మడి గా చేసే పోరాటాల వలన మాత్రమే సాధ్యం కాగలవు . రిజర్వేషన్ వర్గీకరణ జరిగే లోపు దళితులు కల్సి సాధించుకోవాల్సిన అనేక సమస్యలు ఎజండా లోకి రాక పోవడం పెద్ద సమస్య అయి కూర్చున్నది .

దళిత యువ నాయకత్వానికి ఒక లోతు గల శిక్షణ ఇచ్చే ఉద్యమ వాతావరనం కూడా పలుచ బడినట్టు కనిపిస్తూ ఉన్నది

దళిత ఉద్యమం తెచ్చిన చట్ట పరం అయిన రక్షణలు , తెలుగు రాష్ట్రాల లో ఉన్న స్పెషల్ కంపోనెంటు చట్టం అమలు వంటి వాటి మీద చర్చ సన్నగిల్లింది . చాలా పెద్ద పని జరగవలిసి ఉండగా దానిస్థానం లో ''ఎవరు మాదిగలకు నిజం అయిన ప్రతినిధి ?" అనే చర్చ పెద్దది గా మారి పోతూ ఉన్నది తెలంగాణా లో . మాల కులం దాని సమీప కులాల లోని చాలా మందికి ఈ హానికర మైన దూరాలను ఎట్లా తగ్గించుకోవాలి అనే ప్రశ్న వేసుకుని ఎరుకతో ప్రయతనం చేసి ఉమ్మడి తనాన్ని నిర్మించే స్థితీ కనబడటం లేదు .

ఈ వాతావరణం లో తెలంగాణాలో దళిత క్రియాశీల కార్యకర్తల నడుమ తీవ్ర మనస్పర్ధలు ఏర్పడి వ్యక్తి గత దాడులు కేసులు పెట్టుకోవడం స్థాయికి పోవడం ఆందోళన కరం. మొన్న ప్రొఫెసర్ఇ నాక్ గారిని తెగుడుతూ పలువురు వడిన భాష .నిన్న రాము బీరేల్లిమీద జరిగినదాడి పూర్తీ దూరం దూరం అంశాలు ఏమీ కావు .

సాధికారిక మాదిగ దండోరా తమది అనుకునే వారు ఈ విషయం లో చాలా ఆలోచించాల్సిన అవుసరం ఉంది .

ఇది ఇట్లా ఉండగా 1980 లనుండి పైచేస్తూ ఉన్న దళిత క్రియాశీలురు , ఈప్రయత్నాల మీద మీద కొంత లోతు గల అవగాహన ఉన్న వారు కూర్చుని , ఈ దాదాపు మూడున్నర దశాబ్దాల పయనం లో జరిగినది ఏమిటి ? ఇక ముందు ఏమి జరగాలి ? అని సమీక్ష చేసుకోవాల్సిన అవుసరం ఉంది . ఇది తిట్లూ ,శాపనార్థాలు, హద్దు దాటిన ఎకసెక్కాలు గా ఎట్టిపరిస్తితుల లోనూ మారకుండా చూసుకోవాలి . ఇది అట్లాటి సమీక్ష చేసుకోవలిసిన చారిత్రిక సందర్భం కూడా .

ఇప్పుడు ఇరవై ఒకటవ శతబ్దపు రెండు దశాబ్దాలు గడిచి పొతూ ఉన్నయి .1980 లు తొంబై లనాటి కంటే భిన్నం అయిన ప్రబుత్వ వ్యవస్థ ,ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి .సమాజం కూడా చాలా మార్పులకు లోను అవుతూఉన్నది .

ఈ స్థితి లో ఈ సమీక్షను ఎంత ఆలస్యం చేస్తే దళిత ఉద్యమానికి నష్టం . దళిత ఉద్యమానికే కాదు సానుకూల సమాజిక మార్పు ప్రయత్నాలకు అన్నిటికీ నష్టమే .

No comments:

Post a Comment